‘రసాయన టన్నెళ్లను ఏర్పాటు చేయలేం’

తాజా వార్తలు

Published : 24/04/2020 17:30 IST

‘రసాయన టన్నెళ్లను ఏర్పాటు చేయలేం’

కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రోత్సహించవద్దని సూచించింది

తెలంగాణ హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో రసాయనిక టన్నెళ్లను కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది రొనాల్డ్‌ రాజు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు మరోమారు విచారణ జరిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు. 

రసాయన టన్నెళ్లను ప్రోత్సహించవద్దంటూ కేంద్ర వైద్యఆరోగ్యశాఖ సిఫార్సును ఏజీ హైకోర్టుకు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్రంలో అలాంటి టన్నెళ్లను ఏర్పాటు చేయలేమని ఏజీ తెలిపారు. టన్నెళ్ల ద్వారా వ్యక్తులపై సోడియం హైపోక్లోరైట్‌ చల్లడం మంచిది కాదని కేంద్ర ఆరోగ్యశాఖ సిఫార్సులో పేర్కొందన్నారు. రసాయనాలు స్ప్రే చేస్తే శారీరక, మానసిక సమస్యలు తలెత్తుతాయని.. అవి చల్లినా శరీరంలోని కరోనా వైరస్‌ చావదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసినట్లు ఏజీ వివరించారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ ప్రమాదకర రసాయనాలున్నాయా? అనే అంశంపై ఐపీఎంతో చర్చించి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని