తెలంగాణలో మరో 13 కరోనా కేసులు

తాజా వార్తలు

Updated : 24/04/2020 19:21 IST

తెలంగాణలో మరో 13 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఇవాళ కొత్తగా 13 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి ఇప్పటివరకు 500కుపైగా కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. కరోనా నుంచి కోలుకొని ఇవాళ 29 మంది డిశ్చార్జ్‌ కాగా.. డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 291కి చేరింది. ప్రస్తుతం 663 మంది కరోనా రోగులు చికిత్స పొందుతుండగా.. బాధితుల్లో ఏడుగురు వెంటిలేటర్‌పై ఉన్నారని ఈటల తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 983కి చేరింది.

రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో కేవలం నాలుగు ప్రాంతాల నుంచే ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయని ఈటల తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 44 కుటుంబాల ద్వారా 265 మంది కరోనా బారిన పడ్డారన్నారు. వికారాబాద్‌లో 14 కుటుంబాల నుంచి ఎక్కువగా కేసులు నమోదైనట్లు చెప్పారు. సూర్యాపేటలో 25 కుటుంబాల నుంచి 83 మందికి, గద్వాలలో 30 కుటుంబాల నుంచి 45 మందికి కరోనా సోకిందని వివరించారు. పరిస్థితి విషమించిన రోగులకు ప్లాస్మా థెరపీ చేస్తారని.. అందుకోసం దరఖాస్తు చేస్తే అనుమతి వచ్చిందని ఈటల వివరించారు.

డిశ్చార్జ్‌ అయిన వారెవరూ అసంతృప్తిగా లేరు

కరోనా రోగులకు అందించే పౌష్టికాహారంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు అందించే ఆహారం, సౌకర్యాలు సరిగా లేవని రోగులెవరూ చెప్పలేదన్నారు. గాంధీ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా నామకరణం చేశామని.. అక్కడ నుంచి డిశ్చార్జ్‌ అయిన వారెవరూ అసంతృప్తిగా లేరని ఈటల వివరించారు. మరోవైపు రాష్ట్రంలో వైద్యులకు కరోనా సోకలేదన్నారు. పది లక్షల పీపీఈ కిట్లు, 10 లక్షల ఎన్‌-95 మాస్కుల కోసం ఆర్డర్‌ ఇచ్చామని ఈటల తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని