రోగి దగ్గరికి వెళ్లకుండానే మందులు

తాజా వార్తలు

Published : 24/04/2020 23:34 IST

రోగి దగ్గరికి వెళ్లకుండానే మందులు

రిమోట్‌ కంట్రోల్డ్‌ పరికరం అభివృద్ధి చేసిన రైల్వే

న్యూదిల్లీ: దేశంలో కరోనా కట్టడికి అన్ని విభాగాలు తమవంతు కృషి చేస్తున్నాయి. ఇందులో రైల్వేశాఖ కూడా భాగమవుతోంది. తాజాగా ఐసోలేషన్‌ కేంద్రాల్లో కరోనాకు చికిత్స పొందుతున్నవారి వద్దకు మనుషులు వెళ్లకుండానే మందులు చేరవేసేలా ఒక రిమోట్‌ కంట్రోల్డ్‌ పరికరాన్ని రూపొందించింది. ఈ యంత్రం పనితీరు వీడియోను రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం ట్వీటర్‌లో పంచుకున్నారు. ‘వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆసుపత్రుల్లో కరోనా రోగులకు సేవ చేయడానికి రైల్వేశాఖ కొత్త రిమోట్ కంట్రోల్డ్ పరికరాన్ని రూపొందించింది. దీంతో కరోనా బాధితులకు దూరంగా ఉంటూనే వారి బాగోగులు చూసుకోవచ్చు’ అని గోయల్‌ ట్వీట్‌ చేశారు.

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని