పండగ వేళ.. నిర్మానుష్యం ..

తాజా వార్తలు

Published : 25/04/2020 21:26 IST

పండగ వేళ.. నిర్మానుష్యం ..

 

హైదరాబాద్‌ : రంజాన్‌ నెల వచ్చిందంటే పాతబస్తీలోని రహదారులు కళకళలాడుతాయి. చార్మినార్ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మక్కా మసీదులో ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. కానీ ఈసారి పరిస్థితులు ఇందుకు పూర్తి భిన్నంగా మారాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చార్మినార్‌, మక్కా మసీదు పరిసరాలు బోసిపోయాయి. పోలీసులు లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో  రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదని స్థానికులు చెబుతున్నారు. పండగ సమయంలో ఎలాంటి వ్యాపారాల నిర్వహణకు వీలు లేకుండా పోయిందని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని