నర్సు దుస్తుల్లో ముంబయి మేయర్‌

తాజా వార్తలు

Published : 27/04/2020 23:57 IST

నర్సు దుస్తుల్లో ముంబయి మేయర్‌

వైద్య సిబ్బందిని ప్రోత్సహించేందుకేనని వెల్లడి

ముంబయి: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యసిబ్బందికి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నర్సింగ్‌ స్టాఫ్‌ను ప్రోత్సహించేందుకు అక్కడి మేయర్‌ కిశోరీ పెడ్నేకర్‌ సోమవారం నర్స్‌ దుస్తుల్లో బీవైఎల్‌ నాయర్‌ ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. అక్కడి నర్సింగ్‌ సిబ్బందితో ఆస్పత్రి కలియదిరుగుతూ.. వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో ఎదురవుతోన్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆస్పత్రిలో అందరూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘నేను గతంలో నర్సుగా పని చేశాను. ఈ విధుల్లో ఉండే సవాళ్లపై అవగాహన ఉంది. నర్సింగ్‌ సిబ్బందికి.. నేనూ వారిలో ఒకరినే అన్న భావన కల్పించేందుకు ఇలా వచ్చాను. ఈ క్లిష్ట సమయంలో అందరం ఐక్యంగా ఉండి కరోనాపై పోరాడాలి’ అని ఆమె అన్నారు. మరోవైపు ముంబయి పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని