లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ‘పది’ పరీక్షలు

తాజా వార్తలు

Updated : 29/04/2020 13:07 IST

లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత ‘పది’ పరీక్షలు

కేంద్రమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ మంత్రి

అమరావతి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో డిజిటల్‌, ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ను విస్తృతంగా ఉపయోగించుకోవాలని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ సూచించారు. రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొని ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్‌ ఆదేశించారని.. ఆ మేరకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ ముగిసిన రెండు వారాల తర్వాత ఆ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేస్తామని రమేశ్‌ పోఖ్రియాల్‌కు ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. సామాజిక దూరం పాటిస్తూ పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని