పీఎఫ్‌ ఉపసంహరణ.. ఎక్కువగా ఐటీ ఉద్యోగులే

తాజా వార్తలు

Published : 01/05/2020 15:27 IST

పీఎఫ్‌ ఉపసంహరణ.. ఎక్కువగా ఐటీ ఉద్యోగులే

హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ వీకే శర్మ

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో నమోదైన పీఎఫ్ ఉపసంహరణ దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నామని.. దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులే ఉన్నారని హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ వీకే శర్మ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 80,647 మంది దరఖాస్తు చేసుకోగా.. వాటిలో కేవలం హైదరాబాద్‌లోనే 57,445 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. కరోనా కారణంతో దరఖాస్తు చేసుకుంటున్న వారికి ఇప్పటి వరకు రూ.258 కోట్ల మేర నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు.

గతంలో పీఎఫ్‌ ఉపసంహరణకు నమోదు చేసుకున్న వారికి 20 రోజుల వ్యవధిలో నగదు జమ చేసేవారమని.. కరోనా నేపథ్యంలో రెండు నుంచి మూడు రోజుల్లోనే నగదును జమచేస్తున్నట్లు వివరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పీఎఫ్‌ కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉందని.. విడతల వారీగా కేవలం 30 శాతం మంది సిబ్బందితోనే పనిచేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని 11 వేల కంపెనీలు పీఎంజీకేవై పరిధిలోకి వస్తాయని శర్మ తెలిపారు. దీనికింద ఇప్పటి వరకు 4,805 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని.. మిగతా కంపెనీలు కూడా దరఖాస్తు చేసుకోవాలని వీకే శర్మ సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని