ఆహారం లేక రాళ్లు వండిన మాతృమూర్తి

తాజా వార్తలు

Published : 03/05/2020 01:15 IST

ఆహారం లేక రాళ్లు వండిన మాతృమూర్తి

నైరోబీ: ఎనిమిది మంది సంతానం గల ఓ తల్లి లాక్‌డౌన్ కారణంగా వండటానికి ఏమీ లేని పరిస్థితిలో నీళ్లలో రాళ్లు వేసి పొయ్యిమీద ఉడికించటం మొదలుపెట్టింది. ఏడుస్తున్న తన పిల్లలను ఏదో వండుతున్నట్టు నటిస్తూ మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. ఆఫ్రికా ఖండంలోని కెన్యాలో చోటుచేసుకున్న ఈ హృదయవిదారక సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...

కెన్యాకు చెందిన కిటాసో ఓ చదువురాని మహిళ. నీరు, కరెంటు వంటి కనీస సదుపాయాలు లేని చిన్న ఇంటిలో తన ఎనిమిది మంది పిల్లలతో నివసిస్తోంది. భర్త దొంగల దాడిలో మృతి చెందటంతో చుట్టుపక్కల ఇళ్లలో పని చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తితో ఆ దేశంలో కూడా లాక్‌డౌన్ విధించారు. దీనితో పనులు లేక కిటాసోకు రోజుగడవటం కష్టమైంది. తినటానికి ఏమీ లేకపోవటంతో ఆమె పిల్లలు ఆకలితో అలమటించారు.
‘‘నా మిగిలిన పిల్లలు కాస్త పెద్దవాళ్లు. తినటానికి ఏమీ లేదని చెపితే అర్థం చేసుకుంటారు. కానీ వయసులో చాలా చిన్నదైన మా ఆఖరి అమ్మాయి ఆకలికి ఓర్చుకోలేక ఏడవటం మొదలుపెట్టింది. ఇలా చేస్తే అమ్మ ఏదో వండుతోందన్న ఉద్డేశంతో తను ఊరుకుంటుందని నేను ఈ పని చేశాను.’’ అని ఆమె ఓ ఆంగ్ల పత్రికకు వివరించింది.

ఈ దయనీయ పరిస్థితిని గమనించిన పొరుగు మహిళ ఒకరు మీడియాకు సమాచారమివ్వటంతో కిటాసో పరిస్థితి లోకానికి తెలిసింది. ఆ మహిళ కిటాసో పేరుమీద ఓ బ్యాంకు ఖాతాను కూడా తెరిచింది. దీనితో కెన్యాకు చెందిన అనేక మంది ఆమెకు సహాయంగా డబ్బు పంపించటం మొదలుపెట్టారు. తనకు అందుతున్న సహాయం ఓ ఆద్భుతం అని కిటాసో అభిప్రాయపడింది. తనకు సాయం చేస్తామంటూ ఇంకా ఫోన్లు వస్తూనే ఉన్నాయని... తన దేశప్రజలు ఇంతగా ఆదరణ చూపుతారనుకోలేదని కిటాసో వివరించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని