కరోనాతో సహజీవనం తప్పేలా లేదు: హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 09/05/2020 14:56 IST

కరోనాతో సహజీవనం తప్పేలా లేదు: హరీశ్‌రావు

సిద్దిపేట: సిద్దిపేట గ్రీన్‌ జోన్‌లో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని మంత్రి హరీశ్‌రావు జిల్లా ప్రజలకు సూచించారు. మాస్క్‌ ధరించకుంటే రూ.1000 జరిమానా తప్పదని హెచ్చరించారు. శనివారం సిద్దిపేటలోని అంబేడ్కర్‌ నగర్‌లో కరుణ క్రాంతి ఆధ్వర్యంలో రాష్ట్ర పౌరసఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి 1400 మందికి మంత్రి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరోనా కష్టకాలంలో రాష్ట్రంలో అనేక మంది దాతలు సేవాకార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. సిద్దిపేట జిల్లాలోనే ఇప్పటికే 12 వేల మందికి సహాయం అందించినట్లు మంత్రి వివరించారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక నగదు రూ.1500ను అర్హులందరికీ రెండో విడత కింద పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కరోనాతో సహజీవనం తప్పేటట్లు లేదనీ.. అందరి సహకారంతో కరోనాను ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని