తెలంగాణలో 31.. జీహెచ్‌ఎంసీలోనే 30 కేసులు

తాజా వార్తలు

Updated : 09/05/2020 21:24 IST

తెలంగాణలో 31.. జీహెచ్‌ఎంసీలోనే 30 కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,163కి చేరింది. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఒకరు మృతి చెందగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఇవాళ కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 24 మంది బాధితులు డిశ్చార్జ్‌ కాగా.. ఇప్పటివరకు మొత్తంగా 751 మంది కొవిడ్‌ బాధితులు కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 382 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని