31 వరకు భక్తులకు అనుమతి లేదు: వెల్లంపల్లి
close

తాజా వార్తలు

Published : 18/05/2020 15:14 IST

31 వరకు భక్తులకు అనుమతి లేదు: వెల్లంపల్లి

అమరావతి: లాక్‌డౌన్‌ అమలు నేపథ్యంలో ఈ నెల 31 వరకు ఆలయాల్లో భక్తులకు అనుమతివ్వడం లేదని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు ఇది వర్తిస్తుందని చెప్పారు. ఈ మేరకు గత ఆదేశాలను కొనసాగించాలని దేవాదాయ శాఖకు మంత్రి ఆదేశాలుజారీ చేశారు. అయితే, అన్ని దేవాలయాల్లో నిత్య పూజలు మాత్రం కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఆర్జిత సేవల కోసం ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరిపేందుకు భక్తులకు అనుమతిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  ఈ మేరకు సేవలు అందించేందుకు అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని