తల్లి, బిడ్డ క్షేమమే ప్రథమ కర్తవ్యం 

తాజా వార్తలు

Updated : 19/05/2020 00:03 IST

తల్లి, బిడ్డ క్షేమమే ప్రథమ కర్తవ్యం 

ముఖాముఖిలో గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు

హైదరాబాద్‌: ఓ బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆ తల్లి మరో జన్మనెత్తడమే. అదే కరోనా బారిన పడ్డ గర్భిణి అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. గాంధీ ఆసుపత్రి వైద్యులు అలాంటి ఓ నిండు చూలాలికి విజయవంతంగా కాన్పు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే అరుదైన పరిస్థితుల్లో శస్ర్తచికిత్స చేసిన గాంధీ వైద్యులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. జన్మనిచ్చిన తల్లి, పుట్టిన మగ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజారావు తెలిపారు. కరోనాతో వచ్చిన గర్భిణికి పురుడు పోసేందుకు వైద్యులు ఎంతగానో కృషి చేసినట్లు ఆయన తెలిపారు. చిన్నారికి జరిపిన కొవిడ్‌ పరీక్షల్లో ఇప్పటికే నెగటివ్‌ తేలినట్లు వెల్లడించారు. తల్లికి కరోనా ఉన్నందున ప్రస్తుతం బిడ్డను వేరుగా ఉంచి పర్యవేక్షిస్తున్నామంటున్న గాంధీ సూపరింటెండెంట్‌ రాజారావుతో ప్రత్యేక ముఖాముఖి...

కరోనా బారిన పడ్డ గర్భిణికి కాన్పు చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..?
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శస్ర్తచికిత్స చేయడం చాలా ఇబ్బందులతో కూడుకున్నది. కరోనా సోకిన గర్భిణికి కాన్పు చేయడం ఇక్కడే తొలిసారి. ఈ సమయంలో తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా చూడటం మా ముందున్న ప్రథమ కర్తవ్యం. ఆపరేషన్‌ చేసేటప్పుడు అక్కడున్న వైద్య సిబ్బందికి వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ గైనకాలజీ, పిడియాట్రిక్‌, అనెస్తీషియా విభాగాల వైద్యులు విజయవంతంగా శస్ర్తచికిత్స చేశారు. ఈ విషయంలో ఆయా విభాగాల కృషిని అభినందిస్తున్నా. 

పుట్టిన బిడ్డకు తల్లిపాలు తప్పనిసరి. మరి ఈ బిడ్డ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..?
కొన్ని పరిశోధనలు తల్లి పాలు ఇవ్వొచ్చు.. ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ రిస్క్‌ తీసుకోకూడదనే ఉద్దేశంతో వేరే ఫార్ములా ద్వారా ఇస్తున్నాం. నిలోఫర్‌ నుంచి మిల్క్‌ బ్యాగ్‌ తీసుకొచ్చి ఇస్తున్నాం. ప్రస్తుతం బిడ్డను తల్లికి దూరంగా ఉంచుతున్నాం. తల్లికి నెగటివ్‌ వచ్చిన వెంటనే బిడ్డను అప్పగించొచ్చు. మరిన్ని వివరాలు కింది వీడియోలో చూడండి.

 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని