ఆ కొవిడ్‌ రోగి అదృశ్యం కాలేదు..మృతి చెందాడు

తాజా వార్తలు

Updated : 21/05/2020 14:02 IST

ఆ కొవిడ్‌ రోగి అదృశ్యం కాలేదు..మృతి చెందాడు

హైదరాబాద్‌: కరోనా సోకడంతో గాంధీ ఆసుపత్రిలో చేరిన తన భర్త ఆచూకీ లేదని హైదరాబాద్‌ వనస్థలిపురానికి చెందిన ఓ మహిళ ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కి విన్నవించుకుంది. తన భర్తకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో గత నెలలో గాంధీఆసుపత్రిలో చేర్చామని, ఆ తరువాత కుటుంబ మొత్తానికి కరోనా సోకడంతో ఆసుపత్రిలో ఉన్నట్టు ఆమె పేర్కొన్నారు. ఇటీవల కుటుంబ సభ్యులు అందరూ కోలుకుని ఇంటికి రాగా.. తన భర్త రాలేదని తెలిపారు. గాంధీ ఆసుపత్రి వైద్యులను అడిగితే పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని వాపోయింది. తన భర్త ఆచూకీ కనుక్కోవాలని ట్విటర్‌లో ఆమె కోరారు.

ఏం జరిగిందంటే?

గాంధీ ఆసుపత్రిలో కొవిడ్‌ రోగి అదృశ్యంపై తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. ‘‘మొదట్లో కొవిడ్‌తో చనిపోయిన వారిని దహనం చేయడానికి కూడా భయపడ్డారు. ఈశ్వరయ్య ఆసుపత్రిలో చేరిన 24గంటల్లోనే చనిపోయారు. ఆయన కుమారుడు అదే రోజు ఆసుపత్రికి వచ్చారు. గత నెల ఒకటో తేదీన చనిపోయాడు. అతని మృతి గురించి పోలీసులకు తెలిపాం. అతని భార్యకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. ఆ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆసుపత్రిలో ఉండటంతో జీహెచ్‌ఎంసీ సిబ్బందే దహన సంస్కారాలు నిర్వహించారు. వాళ్ల ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మాట్లాడటం సరికాదు. మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టే పరిస్థితి లేదు. అప్పటికే ఒకరిని కోల్పోయారు.. మరొకరి మృతి విషయం తెలిస్తే తట్టుకోలేరని చెప్పడంతో తెలియజేయలేదు. గాంధీ ఆసుపత్రికి రాక ముందే  అతను ఐదారు ఆసుపత్రుల్లో చూపించుకున్నారు. ఇతర వ్యాధులు ఉండటం వల్లే చనిపోయాడు’’ అని మంత్రి ఈటల వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని