ఆ పర్యవేక్షణ ప్రైవేటులో సాధ్యం కాదు:ఈటల

తాజా వార్తలు

Updated : 21/05/2020 20:14 IST

ఆ పర్యవేక్షణ ప్రైవేటులో సాధ్యం కాదు:ఈటల

మొబైల్ కొవిడ్‌ ఐసీయూని ప్రారంభించిన మంత్రి


 

హైదరాబాద్‌: సాధారణ వ్యాధులతో పోలిస్తే కరోనా భిన్నమైనదని.. ఇలాంటి వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తే పేదలు ఇబ్బందిపడే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ప్రాంగణంలో గ్రేస్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన మొబైల్ కొవిడ్‌ ఐసీయూని మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఈటల ప్రారంభించారు. ఈ మొబైల్‌ కొవిడ్‌ ఐసీయూ రేపటి నుంచి అందుబాటులోకి రానుంది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రేస్ ఫౌండేషన్‌ని అభినందించారు. కరోనా సోకిన వారికి కాంటాక్ట్ అయిన వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని.. ఆ మానిటరింగ్ ప్రైవేటులో సాధ్యం కాదని మంత్రి పేర్కొన్నారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షలు, చికిత్సలు చేయాలనే అంశంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సమీక్షించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఈటల వివరించారు.

ఇష్టారీతిన కరోనా పరీక్షలు చేయడం సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం ప్రకారమే పనిచేస్తోందని ఈటల రాజేందర్‌ తెలిపారు. ఐసీఎంఆర్‌ నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేశారు. కరోనాతో మృతి చెందిన బాధితుల కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వకుండానే ఖననం చేశారనే ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరీక్షలు సరిగా నిర్వహించడం లేదని వస్తున్న ఆరోపణలను ఈటల తోసిపుచ్చారు. సరైన పద్ధతిలో పరీక్షలు నిర్వహించకుంటే రాష్ట్రంలో పరిస్థితి మరోలా ఉండేదని.. ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో ముందుకెళ్తోందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే అభివృద్ధి చెందిన దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో మరణాలు రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కొందరు నోటికి వచ్చినట్లు ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని ఈటల హితవు పలికారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని