దేశవ్యాప్తంగా ఈద్‌ వేడుకలు

తాజా వార్తలు

Updated : 25/05/2020 10:09 IST

దేశవ్యాప్తంగా ఈద్‌ వేడుకలు

దిల్లీ : దేశవ్యాప్తంగా ఈద్‌ వేడుకలను భక్తిశ్రద్ధలతో ముస్లిం సోదరులు జరుపుకొంటున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల మేరకు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో తొలిసారి మసీదులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌, కేరళలో నిన్నే ఈద్‌ వేడుకలు నిర్వహించారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

ఈద్‌ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘కరుణ, సేవాతత్పరత, సుహృద్భావానికి ఈ పండగ ప్రతీక. మీ జీవితాల్లో సుఖశాంతులు, సమృద్ధిని కలగజేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఇళ్లలోనే భౌతిక దూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలి’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని