మరో ‘మహా’ మంత్రికి కరోనా పాజిటివ్‌

తాజా వార్తలు

Published : 25/05/2020 21:28 IST

మరో ‘మహా’ మంత్రికి కరోనా పాజిటివ్‌

ముంబయి: మహారాష్ట్రలో మరో మంత్రికి కరోనా వైరస్‌ సోకినట్టు విశ్వసనీయవర్గాలు అంటున్నాయి. సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ అయిన సదరు మంత్రి చికిత్స నిమిత్తం సోమవారం లీలావతి ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం ఎన్సీపీ నాయకుడు, మంత్రి జితేంద్ర అవాద్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ కాగా, ఆ మహమ్మారి వైరస్‌ సోకిన కేబినెట్‌ మంత్రుల్లో ప్రస్తుతం ఈయన రెండోవాడు. గతవారం సదరు మంత్రి తన సొంత జిల్లా వెళ్లేముందు ముంబయిలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరిగి సోమవారం ఉదయం తన సొంత ఊరి నుంచి ముంబయి రాగా కరోనావైరస్‌కు సంబంధించిన లక్షణాలు బయటపడ్డాయి. హుటాహుటిన ఆయన స్వాబ్‌ నమూనాలను కొవిడ్‌-19 పరీక్షకు తరలించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం లీలావతి ఆసుపత్రిలో ఆయనకు చికిత్సనందిస్తున్నట్టుగా వైద్యులు తెలిపారు. అంతకుముందు కరోనాపాజిటవ్‌ తేలిన గృహ నిర్మాణశాఖ మంత్రి జితేంద్రఅవాద్‌ కరోనా నుంచి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం మరింత మెరుగయ్యేందుకు ముంబయిలోని మరో ఆసుపత్రికి తరలించినట్టు అక్కడి వైద్యులు ధృవీకరించారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 50,231 కేసులు నమోదు కాగా, 14,600 మంది కోలుకున్నారు. 1635 మంది మృత్యవాత పడ్డారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని