అమ్మ.. బామ్మోయ్‌.. ఎంత ధైర్యం!

తాజా వార్తలు

Published : 26/05/2020 19:23 IST

అమ్మ.. బామ్మోయ్‌.. ఎంత ధైర్యం!

ఆ బామ్మ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే!

ఇంటర్నెట్‌డెస్క్‌: మన చుట్టుపక్కల చిన్న పామును చూసినా గడగడలాడిపోతాం. ఇక బుసలు కొట్టే పెద్ద నాగుపాము కనిపిస్తే అక్కడి నుంచి పరుగో పరుగు. దాన్ని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది, ఓ బామ్మ పడగవిప్పిన నాగుపామును ఒంటి చేత్తో పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్లింది. అదేదో తాడును పట్టుకెళ్తున్నట్లు విషసర్పాన్ని లాక్కెళ్లింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ అటవీశాఖ అధికారి ట్విటర్‌లో ఈ వీడియోను పోస్టు చేస్తూ అవ్వా..! నాగుపాముతో అలా వ్యవహరించడం సరికాదు అని పేర్కొన్నారు. జనావాసాల్లోకొచ్చిన పెద్ద నాగుపామును, ఆ బామ్మ ఒంటి చేత్తో పట్టుకొని గబగబా నడుచుకుంటూ లాక్కెళ్లింది. దాన్ని ఊరి బయటకు తీసుకెళ్లి విసిరేసింది. ఇది ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. బామ్మ ధైర్యానికి మెచ్చుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. ఇది పోస్టు చేసిన రెండు గంటల్లోనే 15 వేల మంది వీక్షించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని