సుప్రీంను ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్‌

తాజా వార్తలు

Published : 27/05/2020 00:41 IST

సుప్రీంను ఆశ్రయించిన ఎల్జీ పాలిమర్స్‌

దిల్లీ: విశాఖ ఆర్‌.ఆర్‌ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ సంస్ధ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరిశ్రమ నుంచి స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ కారణంగా 12 మంది మృత్యువాత పడటంతో పాటు వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్లాంట్‌ను మూసివేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

హైకోర్టు ఆదేశాలపై ఎల్జీ పాలిమర్స్‌ సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. జస్టిస్‌ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా పరిశ్రమలోకి వెళ్లేందుకు అనుమతివ్వాలని పిటిషన్‌లో కోరింది. విచారణ కోసం నియమించిన ఏడు కమిటీల్లో దేనికి హాజరుకావాలో కూడా అర్థంకాని పరిస్థితి నెలకొందని ఎల్జీ పాలిమర్స్‌ సంస్థ ధర్మాసనం దృష్టికి తెచ్చింది. పిటిషన్‌పై తదుపరి విచారణ కొనసాగించేందుకు ధర్మాసనం నిరాకరించింది. దీనిపై ఎన్జీటీ లేదా హైకోర్టు పూర్తిగా విచారణ చేపడతాయని స్పష్టం చేసింది. హైకోర్టు, ఎన్జీటీలో విచారణ ముగిసిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టుకు రావాలని ధర్మాసనం సూచించింది. జూన్‌ 1న ఎల్జీ పాలిమర్స్‌ కేసుపై ఎన్జీటీలో విచారణ జరగనుంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని