కవలలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

తాజా వార్తలు

Updated : 26/05/2020 22:35 IST

కవలలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు


హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు మరోసారి కరోనా సోకిన గర్భిణికి ప్రసవం చేశారు. ఆమె కవలలకు జన్మనిచ్చారు.  మేడ్చల్‌కు చెందిన గర్భిణికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇవాళ వైద్యులు గర్భిణికి శాస్త్రచికిత్స చేయడంతో కవల పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శిశువులను తల్లినుంచి వేరు చేసి ఐసీయూలో ఉంచినట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ చెప్పారు. తల్లికి నెగెటివ్‌ వచ్చాక శిశువులను తల్లివద్దకు చేర్చుతామని వివరించారు.

ఇదీ చదవండి..

బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని