తలలో ఫ్యాన్‌ బ్లేడ్‌.. 150 కి.మీ. ప్రయాణం

తాజా వార్తలు

Published : 31/05/2020 00:47 IST

తలలో ఫ్యాన్‌ బ్లేడ్‌.. 150 కి.మీ. ప్రయాణం

ఇండోర్‌ (మధ్యప్రదేశ్‌): తలకు తగిలిన ఫ్యాన్‌ బ్లేడుతో 150 కిలోమీటర్లు ప్రయాణించాడు ఓ రెండున్నరేళ్ల బాలుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. బాంబే ఆసుపత్రి న్యూరో సర్జన్‌ డాక్టర్‌ అతుల్‌ గుప్తా తెలిపిన వివరాల ప్రకారం.. ఖండ్వా గ్రామానికి చెందిన రెండున్నరేళ్ల బాలుడు.. ఇంట్లో ఆడుకుంటుండగా వేగంగా తిరుగుతున్న ఫ్యాన్‌ బ్లేడు అతడి తలకు తగిలింది. గమనించిన బాలుడి తల్లిదండ్రులు స్థానిక జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తమ వల్ల కాదని చెప్పడంతో చేసేదేం లేక 150 కిలోమీటర్ల దూరంలో ఇండోర్‌లోని ఎంవై ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి సర్జరీ కోసం బాంబే ఆసుపత్రికి తరలించారు. తమ వద్దకు వచ్చే సరికి బాలుడు స్పృహలో ఉన్నాడని..  సుమారు 45 నిమిషాల పాటు శ్రమించి తలలో ఇరుక్కున్న ఫ్యాన్‌ బ్లేడును తొలగించామని న్యూరో సర్జన్‌ డాక్టర్ అతుల్‌గుప్తా  వెల్లడించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని