పొగాకు నియంత్ర‌ణ‌లో తెలంగాణ ముందంజ 

తాజా వార్తలు

Updated : 01/06/2020 14:58 IST

పొగాకు నియంత్ర‌ణ‌లో తెలంగాణ ముందంజ 

వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌

హైద‌రాబాద్‌: పొగాకు నియంత్ర‌ణ‌లో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉంద‌ని రాష్ట్ర వైద్య‌, ఆరోగ్యశాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. ఈ దురల‌వాట్ల‌కు యువ‌త దూరంగా ఉండాలంటూ సూచించారు. ప్ర‌పంచ పొగాకు వ్య‌తిరేక దినోత్స‌వం నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను మంత్రి ఈట‌ల వివ‌రించారు.

‘‘ఎంతో నష్టం కలిగిస్తున్న పొగాకు అలవాటుకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. కేవలం ప్రభుత్వ ప్రమేయమే కాకుండా ప్రజలందరూ ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే కాపాడుకోవాలి. ఈ విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి.  పొగాకు నియంత్రణ జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ, వివిధ శాఖలు, పోలీస్‌శాఖ అన్నీ ఎంతో సమన్వయంతో, సమర్థంగా పనిచేస్తున్నాయి. పొగాకు వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను, దాన్ని అరికట్టడానికి, ప్రజలలో అవగాహనను పెంచటానికి ఎంతో మంది వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు నిరంతరం ఎంతో కృషి చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో తెలంగాణను పొగాకు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తాం’’ అని అన్నారు. ప్ర‌జ‌లకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే బ‌స్తీ ద‌వాఖానాలు ప్రారంభించినట్లు చెప్పిన ఈటెల.. గతంలో ఉన్న 122 దవాఖానాలకు అదనంగా 44 కొత్తవి ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని బస్తీ దవాఖానాలు తెరుస్తామని అన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని