విద్యుత్‌ తీగలపై నడిచి.. చెట్టుకొమ్మని తీసి

తాజా వార్తలు

Published : 03/06/2020 02:02 IST

విద్యుత్‌ తీగలపై నడిచి.. చెట్టుకొమ్మని తీసి

సాహసం చేసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగి

నిజాంపూర్‌: ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలపై పడిన చెట్టుకొమ్మను తొలగించడానికి ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి సాహసం చేశాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలం నిజాంపూర్‌లో గాలి ఉద్ధృతికి ఓ చెట్టు కొమ్మ విద్యుత్‌ తీగలపై పడింది. సమాచారం అందుకున్న విద్యుత్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి నూర్‌.. స్తంభం ఎక్కి విద్యుత్‌ తీగలపై నడుచుకుంటూ వెళ్లి కొమ్మను తొలగించాడు. ఆ యువకుడు క్షేమంగా కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఇంతటి ప్రమాదకర పని చేయించడంపై విద్యుత్‌ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని