16 నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు

తాజా వార్తలు

Published : 08/06/2020 15:08 IST

16 నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. దీనికి సంబంధించిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదానికి పంపారు. ఆయన ఆమోదం తర్వాత ఈ సాయంత్రంలోగా అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో 16 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 18వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ ఎన్నిరోజులు జరపాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 30వ తేదీతో ఓటాన్ అకౌంట్ కోసం తెచ్చిన ఆర్డినెన్స్ గడువు ముగియనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని