ఈటల ముందు జూడాల 5 డిమాండ్లు!

తాజా వార్తలు

Published : 10/06/2020 18:52 IST

ఈటల ముందు జూడాల 5 డిమాండ్లు!

హైదరాబాద్: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యులు (జూడాలు) ఆందోళన నిర్వహించారు. జూనియర్‌ వైద్యుడిపై నిన్న రాత్రి జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ ఆస్పత్రి ముందు బైఠాయించారు. నిన్న రాత్రి నుంచి విధులు బహిష్కరించిన 300 మంది జూడాలు దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. జూడాల ఆందోళనపై స్పందించిన వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వారితో గాంధీ ఆస్పత్రిలో సమావేశమయ్యారు. ప్రధానంగా వారు ఐదు డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

ఇవే డిమాండ్లు..

* రాష్ట్రంలో ఎక్కడ కరోనా సోకినా గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కొవిడ్‌ రోగులకు గాంధీతో పాటు ఇతర ప్రభుత్వ ఆస్పత్రిల్లోనూ చికిత్స అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

* కొత్తగా వైద్యుల నియామకం చేపట్టాలి. దీంతో ప్రస్తుతం ఉన్న వైద్యులపై కొంత మేర భారం తగ్గే అవకాశం ఉంటుంది.

* ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్‌ వైద్యుల్లో పీజీ పూర్తి చేస్తున్న వారిని సీనియర్‌ రెసిడెంట్స్‌గా తీసుకోవాలి.

* గతంలో వైద్యులపై దాడి చేసిన వారికి ఎలాంటి శిక్షలు వేశారు.. ఇక ముందు దాడి చేస్తే ఎలాంటి శిక్షలు అమలు చేస్తారనే విషయంలో భారీగా ప్రచారం కల్పించాలి.


ఇదీ చదవండి..

గాంధీలో కొనసాగుతున్న జూడాల ధర్నా

‘గాంధీ’లో పీజీ వైద్యులపై దాడి
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని