జూడాలతో చర్చలు జరిపిన మంత్రి ఈటల

తాజా వార్తలు

Published : 11/06/2020 22:59 IST

జూడాలతో చర్చలు జరిపిన మంత్రి ఈటల

హైదరాబాద్‌: తమపై దాడికి నిరసనగా విధులు బహిష్కరించిన జూనియర్‌ వైద్యులతో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. బీఆర్కే భవన్‌లో దాదాపు గంటసేపు జూడాల బృందంతో మంత్రి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్లు లేవనెత్తిన డిమాండ్లపై మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా గాంధీ ఆస్పత్రిలో త్వరలో కొవిడ్‌ 19 సహా ఇతర వైద్య సేవలను కొనసాగించనున్నట్లు మంత్రి హామీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా కొవిడ్‌ రోగులను ఇతర ఆస్పత్రుల్లోనూ చేర్చుకునేందుకు మంత్రి సుముఖత వ్యక్తం చేశారని జూడాలు వెల్లడించారు. వైద్యుల రక్షణ కోసం ఎస్‌పీఎఫ్‌ బలగాలను అందుబాటులో ఉంచుతామని మంత్రి వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని సమాచారం చేరవేయాలని మంత్రి వారితో చెప్పినట్లు జూడాలు వెల్లడించారు. జూడాల బృందంతో ప్రతివారం మాట్లాడి సమస్యలు తెలుసుకుంటామని మంత్రి పేర్కొన్నట్లు వారు తెలిపారు. అంతేకాకుండా సిబ్బంది పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని మంత్రి పేర్కొన్నట్లు సమాచారం. మంత్రి హామీతో భవిష్యత్తు కార్యాచరణపై గాంధీ ఆస్పత్రిలో జూడాలు మరోమారు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని