సీఎం సమీక్ష: ఆరు సాగునీటి ప్రాజెక్టులపై...

తాజా వార్తలు

Published : 25/06/2020 15:55 IST

సీఎం సమీక్ష: ఆరు సాగునీటి ప్రాజెక్టులపై...

అమరావతి: అక్టోబరులో అవుకు టన్నెల్‌-2 ద్వారా సాగునీరు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న ఆరు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అవుకు టన్నెల్‌-2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వెలుగొండ టన్నెల్‌-1లో ఇంకా 700 మీటర్లు తవ్వాల్సి ఉందని చెప్పారు. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్‌-1 ద్వారా నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. నెల్లూరులోని సంగం ప్రాజెక్టు ద్వారా అక్టోబరు నాటికి సాగునీటిని విడుదల చేయాలని జగన్‌ తెలిపారు.

వంశధార-నాగావళి లింక్‌ ద్వారా డిసెంబర్‌లో నీటి విడుదల చేయాలని సీఎం నిర్ణయించారు. వర్షపు నీరు వచ్చే సమయంలోనూ చేసుకోదగ్గ పనులను చేసుకోవాలని సూచించారు. నవంబర్‌లో ఎట్టి పరిస్థితుల్లో గేట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పనులు ప్రణాళికాబద్ధంగా సాగకపోతే షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడుతుందన్నారు. దీంతోపాటు పోలవరం ముంపు బాధితులను తరలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రూ.3,791 కోట్లకు సంబంధించి కేంద్రం నుంచి రీఎంబర్స్‌ పొందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని