దేవుడి ఆశీర్వాదం వల్లే మేం కోలుకున్నాం

తాజా వార్తలు

Published : 03/07/2020 02:18 IST

దేవుడి ఆశీర్వాదం వల్లే మేం కోలుకున్నాం

వీహెచ్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌: దేవుడి ఆశీర్వాదంతోనే తాను, తన భార్య కరోనా నుంచి బతికి బయటపడ్డామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందిన వీహెచ్‌ దంపతులు నిన్న  సాయంత్రం డిశ్ఛార్జి అయ్యారు. ఈ సందర్భంగా గురువారం వీహెచ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఏకం చేసేందుకే తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తానని వెల్లడించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా పరుగు, పరుగున వెళ్లే తాను త్వరితగతిన కోలుకోవాలని ఎందరో ప్రార్థనలు చేశారన్నారు. వారందరి ప్రార్థనలు ఫలించడం వల్లే తామిద్దరం బయట పడగలిగామన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడేందుకు తన వంతు కృషిచేస్తానని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని