నూతన టీఎస్‌ సచివాలయం నమూనా ఖరారు

తాజా వార్తలు

Updated : 07/07/2020 09:28 IST

నూతన టీఎస్‌ సచివాలయం నమూనా ఖరారు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న నూతన రాష్ట్ర సచివాలయం నమూనా ఖరారైంది. తాజాగా సచివాలయం నమూనా చిత్రాన్ని సీఎం కార్యాలయం విడుదల చేసింది. ఎప్పటి నుంచో ప్రభుత్వం కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మించాలని నిర్ణయించింది. కానీ న్యాయపరమైన అడ్డంకులు వచ్చిపడ్డాయి. ఇటీవల హైకోర్టు సచివాలయ భవనాల కూల్చివేతకు.. కొత్త సచివాలయం నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తెల్లవారుజామునుంచే సచివాలయ భవనాల కూల్చివేత పనులను ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ వెంటనే కొత్త సచివాలయ నమూనా విడుదల చేసింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని