గాంధీలో పొరుగుసేవల సిబ్బంది ఆందోళన

తాజా వార్తలు

Updated : 14/07/2020 13:08 IST

గాంధీలో పొరుగుసేవల సిబ్బంది ఆందోళన

సికింద్రాబాద్‌: వేతనాల పెంపు, ఉద్యోగాల క్రమబద్దీకరణ సహా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి పొరుగుసేవల సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, సెక్యూరిటీ సిబ్బంది విధులు బహిష్కరించి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పొరుగుసేవల సిబ్బంది మొత్తం జేఏసీగా ఏర్పడి ధర్నా నిర్వహిస్తున్నారు. నర్సులు, ఇతర సిబ్బంది విధులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించడంతో గాంధీఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయి రోగులు ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పొరుగుసేవల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను గుర్తించడం లేదని వాపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతైనా తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తారని భావించామని, ఇప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో కొత్తగా రిక్రూట్‌ చేసుకున్న నర్సులకు రూ.25వేల వేతనం ఇస్తున్నారని, 14ఏళ్లుగా పనిచేస్తున్న తమకు రూ.17,500ల వేతనం ఇస్తున్నారని ఔట్‌సోర్సింగ్‌ నర్సులు ఆరోపిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని