పది పరీక్షలు రద్దు..ఏపీ అధికారిక ఉత్తర్వులు

తాజా వార్తలు

Updated : 14/07/2020 16:06 IST

పది పరీక్షలు రద్దు..ఏపీ అధికారిక ఉత్తర్వులు

అమరావతి: కరోనా విజృంభన నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2020 పరీక్షలకు నమోదు చేసుకున్న పదో తరగతి విద్యార్ధులందరినీ పాస్ చేస్తున్నట్టు పేర్కొంది. ఎస్ఎస్‌సీ, ఓఎస్ఎస్‌సీ, ఒకేషనల్ పరీక్షలన్నీ రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమైన హాల్ టికెట్లు పొందిన విద్యార్థులందరికీ ఎలాంటి గ్రేడ్ పాయింట్లూ ఇవ్వకుండానే ఉత్తీర్ణుల్ని చేసినట్లు ప్రకటించారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని