నిను వీడి నేనుండలేను..ఒక్కటైన ఆవు-ఎద్దు!

తాజా వార్తలు

Published : 14/07/2020 18:10 IST

నిను వీడి నేనుండలేను..ఒక్కటైన ఆవు-ఎద్దు!

మధురై: కరోనా ప్రభావంతో తమిళనాడులోని మధురైలో విడిపోయిన ఓ ఆవు-ఎద్దు జంట తిరిగి ఒక్కటయ్యింది. తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం చిన్న కుమారుడు జయప్రదీప్‌ కృషితో మూగజీవాల జంట మళ్లీ కలుసుకుంది. కరోనా వల్ల ఆర్థికంగా కుదేలైన ఓ రైతు తన వద్దనున్న ఆవును మరో గ్రామానికి చెందిన రైతుకు విక్రయించాడు. ఇంతవరకు కలిసి మెలిసి ఉన్న తమను విడదీయవద్దన్న రీతిలో స్థానిక ఓ ఆలయంలో ఉండే ఎద్దు.. ఆవును తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకుంది. దాదాపు గంటసేపు వాహనాన్ని కదలనీయకుండా చేసింది. చివరికి వాహనం కదలడంతో దానివైపే పరుగులు తీసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో పన్నీర్‌ సెల్వం చిన్నకుమారుడు జయప్రదీప్‌ ఆవును కొని స్థానిక పాలమేడు అంజమలై కమిటీకి అప్పగించారు. ఆవు,ఎద్దు మళ్లీ ఒక్కటవ్వడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని