రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో నిరవధిక సమ్మె

తాజా వార్తలు

Published : 14/07/2020 23:00 IST

రేపటి నుంచి గాంధీ ఆస్పత్రిలో నిరవధిక సమ్మె

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న పొరుగు సేవలు, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్‌ సిబ్బంది రేపటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి నిరవధికంగా సమ్మె చేస్తామని సీఐటీయూ సభ్యుడు కుమార్‌ పేర్కొన్నారు.మరోవైపు కరోనాతో చనిపోయిన శ్రీనివాస్‌ (55) మృతదేహాన్ని తరలించడంలో ఆలస్యంపై వివాదం రాజుకుంది. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు స్పందించారు. మృతదేహాన్ని తరలించకుండా 8 గంటలపాటు ఉంచారనే ఆరోపణలపై వివరణ ఇచ్చారు. ‘‘మృతదేహాన్ని ఈసీజీ తీసేందుకు కొంచెం సమయం పట్టింది. సరిపడా సిబ్బంది లేనందున మృతదేహం తరలింపులో ఆలస్యం జరిగింది. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే 6 ఐసీయూలు, వార్డులు నిర్వహిస్తున్నాం. మార్చురీకి తరలింపులో ఎనిమిది గంటలు ఆలస్యమైందనే మాటలో వాస్తవం లేదు’’ అనిరాజారావు అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని