Raghurama: రమేశ్ ఆస్ప‌త్రికి త‌ర‌లింపులో జాప్యం

తాజా వార్తలు

Updated : 17/05/2021 10:42 IST

Raghurama: రమేశ్ ఆస్ప‌త్రికి త‌ర‌లింపులో జాప్యం

గుంటూరు: ఏపీ హైకోర్టు ఆదేశాల మేర‌కు ఎంపీ రఘురామ‌కృష్ణ‌రాజును ఈ ఉద‌యం గుంటూరులోని ర‌మేశ్‌ ఆస్ప‌త్రికి త‌రలించాల్సి ఉన్నా.. అధికారులు ఆ మేర‌కు చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. దీంతో ఆయ‌న ఇంకా జిల్లా జైలులోనే ఉన్నారు. ఎంపీని రమేశ్ ఆస్ప‌త్రికి త‌ర‌లించాల‌ని ఉన్న‌త న్యాయ‌స్థానం నిన్న రాత్రి ఆదేశించిన విష‌యం తెలిసిందే. కాగా.. త‌ర‌లింపున‌కు సంబంధించి ఆర్డ‌ర్ కాపీ రాలేద‌ని అధికారులు చెబుతున్నారు. ర‌ఘురామ‌ను ర‌మేశ్ ఆస్పత్రికి త‌ర‌లించే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో దీనికి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వ త‌ర‌ఫున అధికారులు హైకోర్టులో పిటిష‌న్ వేయ‌నున్న‌ట్లు స‌మాచారం. మరోవైపు సీఐడీ అధికారుల తీరుపై ర‌ఘురామ కుటుంబ‌స‌భ్యులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఎంపీకి నిన్న జీజీహెచ్‌లో మాత్ర‌మే వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించి ర‌మేశ్ ఆస్పత్రికి తీసుకెళ్ల‌ని విష‌యం తెలిసిందే. అయితే..  మెజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఎంపీని రమేశ్‌ ఆసుపత్రికి తరలించాలని ఉన్న‌త న్యాయ‌స్థానం ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై అద‌న‌పు అడ్వొకేట్ జ‌న‌ర‌ల్‌(ఏఏజీ) అభ్యంతరం తెలుపుతూ రమేశ్‌ ఆసుపత్రికి తరలించడం అంటే తెదేపా కార్యాలయానికి పంపడం లాంటిదేనన్నారు. అగ్నిప్రమాదం జరిగి పది మంది చనిపోయిన వ్యవహారంలో రమేశ్‌ ఆసుపత్రి ఎండీపై ఇప్పటికే ప్రభుత్వం కేసు నమోదు చేసిందని గుర్తుచేశారు. అక్కడికి పంపొద్దని కోరగా ధర్మాసనం నిరాకరించింది. మెజిస్ట్రేట్‌ ఉత్తర్వులను కనీసం రెండు రోజులైనా నిలుపుదల చేయాలన్న ఏఏజీ అభ్యర్థననూ హైకోర్టు ఆదివారం తోసిపుచ్చిన విష‌యం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని