బిర్యానీలో మసాలా లేదు.. లెగ్‌పీస్‌ రాలేదు!

తాజా వార్తలు

Updated : 29/05/2021 06:52 IST

బిర్యానీలో మసాలా లేదు.. లెగ్‌పీస్‌ రాలేదు!

కేటీఆర్‌కు నెటిజన్‌ వింత ఫిర్యాదు
మంత్రి విస్మయం

ఈనాడు, హైదరాబాద్‌: ట్విటర్‌ వేదికగా ప్రజల సమస్యలపై స్పందిస్తూ, వాటిని పరిష్కరించడంతోపాటు వివిధ అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న మంత్రి కేటీ రామారావుకు శుక్రవారం ట్విటర్‌లో తోటకూర రఘుపతి అనే వ్యక్తి నుంచి వింత ఫిర్యాదు వచ్చింది. ‘‘కేటీఆర్‌ గారూ! నేను ఆన్‌లైన్‌లో చికెన్‌ బిర్యాని ఆర్డర్‌ చేశాను. అదనపు మసాలాతోపాటు లెగ్‌పీస్‌ పంపాలని కోరారు. అవేమీ రాలేదు. కావాలంటే ఈ ఫోటో చూడండి. ప్రజలకు ఇలాగేనా సేవలందించడం’’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మంత్రి విస్మయం చెందారు. ‘‘ఈ విషయంలో నేనేం చేయగలను బ్రదర్‌. నా నుంచి నువ్వేం ఆశిస్తున్నావు’’ అని ప్రశ్నించారు.  తర్వాత ఆ ట్వీట్‌ను కేటీఆర్‌ తొలగించారు.

ఆ బాలుడికి కళ్లు తెప్పిస్తాం
ఒక నెజిజన్‌ హైదరాబాద్‌కు చెందిన ఐదేళ్ల బాలుడికి రూ.1.5 లక్షలతో కంటి శస్త్రచికిత్స చేయించాలని ట్విటర్‌లో అభ్యర్థించారు. స్పందించిన కేటీఆర్‌ ఆ ఖర్చును తామే భరించి ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తానని హామీ ఇచ్చారు.

శస్త్రచికిత్స చేయించరూ..
రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన పేద గిరిజనుడు ధరమ్‌సోత్‌ సీతారామ్‌ నాయక్‌ను ఆదుకోవాలంటూ ఒక నెటిజన్‌ కేటీఆర్‌ను కోరారు. శస్త్రచికిత్సకు రూ.15 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారని, అంత ఖర్చు భరించే స్థితిలో ఆ కుటుంబం లేదన్నారు. స్పందించిన మంత్రి అతడిని ఆదుకుంటానని హామీ ఇవ్వడంతోపాటు చికిత్సకు ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని