AP News: ఏపీలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈఏపీ సెట్
close

తాజా వార్తలు

Updated : 19/06/2021 13:46 IST

AP News: ఏపీలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈఏపీ సెట్

సెప్టెంబ‌ర్ మొద‌టి, రెండు వారాల్లో ఇత‌ర ప్ర‌వేశ ప‌రీక్ష‌లు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఎంసెట్‌కు బ‌దులుగా ఈఏపీ సెట్(EAPCET) నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ వెల్ల‌డించారు. ఇంజినీరింగ్‌, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మ‌సీ కామ‌న్ ఎంట్ర‌న్స్ టెస్టుగా ఈఏపీ సెట్ ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వివ‌రించారు. నోటిఫికేష‌న్ ఈ నెల 24న విడుద‌ల చేస్తామ‌ని.. 26 నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌ని వివ‌రించారు. జులై 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌రణ ఉంటుంద‌న్నారు. ఆగ‌స్టు 19 నుంచి 25 వ‌ర‌కు పరీక్షలు నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది.

జులై 26 నుంచి ఆగ‌స్టు 5 వ‌ర‌కు రూ.500, ఆగ‌స్టు 6 నుంచి 10 వ‌ర‌కు రూ.1000, జులై 11 నుంచి 15 వ‌ర‌కు రూ.5000, ఆ నెల 16 నుంచి 18 వ‌ర‌కు రూ.10 వేల ఆలస్య రుసుముల‌తో ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ మొద‌టి, రెండు వారాల్లో ఈసెట్, ఐసెట్‌, పీజీ సెట్, లాసెట్‌, ఎడ్ సెట్‌, పీసెట్ నిర్వ‌హ‌ణ‌కు విద్యాశాఖ ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని