CM KCR: సిద్దిపేట‌లో కార్యాల‌యాల ప్రారంభం 

తాజా వార్తలు

Updated : 20/06/2021 14:21 IST

CM KCR: సిద్దిపేట‌లో కార్యాల‌యాల ప్రారంభం 

సిద్దిపేట‌: సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఇవాళ సిద్దిపేట‌లో ప‌ర్య‌టిస్తున్న ఆయ‌న ప‌లు అభివృద్ది ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టనున్నారు. ఆధునిక స‌దుపాయాల‌తో జీప్ల‌స్ వ‌న్‌గా ఎక‌రం విస్తీర్ణంలో రూ.4 కోట్ల‌తో సిద్దిపేట ఎమ్మెల్యే కార్యాల‌యాన్ని నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్యాల‌యం, మొద‌టి అంత‌స్తులో నివాస స‌ముదాయం ఏర్పాటు చేశారు. అనంత‌రం కొండ‌పాక మండ‌లం రాంప‌ల్లి శివారులోని సిద్దిపేట‌ పోలీస్ క‌మిష‌న‌రేట్‌ స‌ముదాయాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. మంత్రులు హ‌రీశ్‌రావు, ప్ర‌శాంత్‌రెడ్డి, మ‌హ‌మూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

అనంత‌రం కొండ‌పాక మండ‌లం దుద్దెడ వ‌ద్ద 50 ఎక‌రాల్లో నిర్మించిన సిద్దిపేట క‌లెక్ట‌రేట్ స‌మీకృత స‌ముదాయ భ‌వ‌నాల‌ను కేసీఆర్ ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే రఘ‌నంద‌న్‌రావు, స్థానిక ప్రజా ప్ర‌తినిధులు పాల్గొన్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని