తిరుపతిలో విద్యుత్తు బస్సులకు కుదిరిన ధర?

తాజా వార్తలు

Updated : 01/07/2021 12:23 IST

తిరుపతిలో విద్యుత్తు బస్సులకు కుదిరిన ధర?

ఈనాడు, అమరావతి: ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నడపనున్న విద్యుత్తు బస్సులకు సంబంధించి టెండర్లలో ధరల ఖరారు పూర్తిగా కొలిక్కి రాలేదు. తిరుమల ఘాట్‌లోనూ, తిరుపతి అర్బన్‌ పరిధిలో నడిపే బస్సులకు సంబంధించి  ధరపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. తొలుత ఈ టెండర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ నగరం, గుంటూరు, విజయవాడ, కాకినాడలకు సంబంధించి దాఖలైన టెండర్లలో ఎల్‌-1గా నిలిచిన ఒలెక్ట్రా, అశోక్‌ లేలాండ్‌ సంస్థలు కోట్‌ చేసిన ధరలపై అధికారులు 5రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఏసీ బస్సులకు కిలో మీటర్‌కు సగటున ఎంత ఖర్చవుతుంది? విద్యుత్తు బస్సులకు ఎంత చెల్లించాల్సి ఉంటుందనేది బేరీజు వేస్తున్నారు. తిరుమల ఘాట్, తిరుపతి అర్బన్‌ పరిధిలో నడిపే బస్సుల విషయంలో.. ఆర్టీసీ అంచనా వేసిన ధరతో నడిపేందుకు సంబంధిత కంపెనీ సమ్మతించడంతో వీటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని