KTR: కేటీఆర్‌కు అపురూప కానుక

తాజా వార్తలు

Updated : 28/07/2021 08:33 IST

KTR: కేటీఆర్‌కు అపురూప కానుక

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శోభ దంపతుల పంచలోహ చిత్రాలతో ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్‌)కు పుట్టినరోజు కానుకగా బహూకరించారు. ఇద్దరు ప్రముఖ శిల్పులు 3 నెలల పాటు శ్రమించి దీనిని తయారు చేశారని తెలిపారు. కేటీఆర్‌ పుట్టినరోజు నాడు మహబూబ్‌నగర్‌లో ముక్కోటి వృక్షార్చన, రక్తదానం, దివ్యాంగులకు త్రిచక్ర మోటారు వాహనాలను పంపిణీ చేశామన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఇది తనకెంతో అపురూపమైన కానుక అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసగౌడ్‌ కుమార్తెలు శ్రీహిత, శ్రీహర్షితలు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని