TS News: ట్రైనీ మహిళా ఎస్సై ఫిర్యాదు.. మరిపెడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్‌

తాజా వార్తలు

Updated : 04/08/2021 07:48 IST

TS News: ట్రైనీ మహిళా ఎస్సై ఫిర్యాదు.. మరిపెడ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెండ్‌

ఈనాడు డిజిటల్‌, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, మరిపెడ

మహబూబాబాద్‌ జిల్లాలో మంగళవారం కలకలం రేగింది. తొర్రూరు సబ్‌ డివిజన్‌ పరిధిలోని మరిపెడ ఎస్సైగా పనిచేస్తున్న పొలిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనపై అత్యాచారయత్నం చేశాడంటూ శిక్షణ మహిళా ఎస్సై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషికి ఫిర్యాదు చేయడంతో ఇది బయటకు పొక్కింది.ఎస్పీ ఆదేశాల మేరకు తొర్రూరు డీఎస్పీ అధికారి వెంకటరమణ మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చి విచారణ చేపట్టారు.సాయంత్రం ఎస్సైని సస్పెండ్‌ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

కమిషనరేట్‌లోనే ఫిర్యాదు ఎందుకు.. ?

విధి నిర్వహణలో భాగంగా ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎస్పీకి సమాచారమందించాలి. సదరు శిక్షణ ఎస్సై నేరుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ను సంప్రదించి తనకు జరిగిన అన్యాయాన్ని, అవమానాన్ని వివరించారు. మహబూబాబాద్‌.. కమిషనరేట్‌ పరిధిలో లేకున్నా ఎస్పీకి కాకుండా, అటువైపు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని చర్చనీయాంశంగా మారింది. మొదట ఆమెను శిక్షణ ఎస్సైగా కమిషనరేట్‌కు కేటాయించగా, గ్రామీణ ప్రాంత పరిస్థితులపై శిక్షణ పొందేందుకు మరిపెడ పోలీస్‌స్టేషన్‌లో పనిచేయాలని ఆదేశాలివ్వడంతోనే ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. స్థానికంగా భరోసా కేంద్రం మహబూబాబాద్‌లో లేకపోవడం, వరంగల్‌లోనే ఉండటంతో రక్షణ కోసం దాన్ని ఆశ్రయించారు.

ఎస్సై మరో కోణం..

2014 బ్యాచ్‌కు చెందిన ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో విధులు నిర్వర్తించాడు. తొలుత కే సముద్రం, తరువాత గార్లలో పని చేశాడు. అక్కడి నుంచి మట్టెవాడకు వచ్చాడు. ఏప్రిల్‌ 14న మరిపెడకు బదిలీ అయ్యాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగస్వామ్యమై ఉన్నతాధికారుల మన్ననలు పొందుతున్న అధికారిలో మరో కోణం బట్టబయలైంది.

మార్పు వస్తేనే..!

ఇటీవల కాలంలో కొందరు అధికారుల వ్యవహారశైలిపై ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు మందలిస్తున్నా.. మారడం లేదు. ఇప్పటికైనా వారి ప్రవర్తనలో మార్పులు వచ్చేలా చూస్తే.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని