వ్యాక్సిన్‌ వేసుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతి

తాజా వార్తలు

Updated : 11/04/2021 17:55 IST

వ్యాక్సిన్‌ వేసుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతి

తమ ఉద్యోగులకు జీహెచ్‌ఎంసీ ఆదేశం

హైదరాబాద్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ విషయంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ ఉద్యోగులంతా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని ఆదేశించింది. వ్యాక్సిన్‌ వేయించుకుంటేనే కార్యాలయాల్లోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగులంతా ఈ నెల 15లోపు వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించింది. 30వేల మంది సిబ్బందికి వ్యాక్సిన్‌ వేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు కొవిడ్‌ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ తప్పనిసరి చేసింది. మాస్క్‌ ధరించని వారికి జరిమానా విధించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. మాస్క్‌ ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా విధించాలని డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులకు సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని