జీహెచ్‌ఎంసీకి అరుదైన ఘనత

తాజా వార్తలు

Updated : 28/03/2021 15:07 IST

జీహెచ్‌ఎంసీకి అరుదైన ఘనత

చిరువ్యాపారులకు రుణాల మంజూరులో అగ్రస్థానం

హైదరాబాద్‌: నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఒకొక్క చిరు వ్యాపారికి రూ. 10వేల తక్షణ సాయం అందించడంలో భాగంగా రికార్డు స్థాయిలో 34,878 మందికి అందించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలు తిరిగి ప్రారంభించేలా చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ముఖ్యంగా చిరు వ్యాపారులు, వీధుల్లో చిన్నచిన్న షాపులు నిర్వహించేవారి కోసం కేంద్రం ప్రకటించింది.

ఈ పథకం ద్వారా ఇప్పటివరకు గ్రేటర్ పరిధిలో 1,62,105 మంది చిరువ్యాపారులను గుర్తించగా వీరిలో 1,57,945 మంది వివరాలను మెప్మా పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. 1,54,335 మంది చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు. ఈ చిరువ్యాపారుల్లో ఒకొక్కరికి రూ. 10వేలు తక్షణ సాయం అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా 67,233 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 34,878 మందికి రుణాలను అందించడం ద్వారా జీహెచ్‌ఎంసీ అగ్రస్థానంలో నిలిచింది. ఇండోర్, కాన్పూర్, వారణాసి తర్వాత స్థానాల్లో నిలిచాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని