GHMC: మినీ కంటైన్‌మెంట్‌ జోన్స్‌ ఏర్పాటు

తాజా వార్తలు

Published : 22/04/2021 17:47 IST

GHMC: మినీ కంటైన్‌మెంట్‌ జోన్స్‌ ఏర్పాటు

హైదరాబాద్‌: తెలంగాణలో సెకండ్‌ వేవ్‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ కొవిడ్‌ బారినపడుతోన్న బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హైదరాబాద్‌ నగరంలోనూ వేగంగా వ్యాపిస్తోన్న కరోనాను కట్టడి చేసేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) చర్యలకు ఉపక్రమించింది. జీహెచ్‌ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో మొత్తం 63 మినీ కంటైన్‌మెంట్‌ జోన్లను ఏర్పాటు చేసింది. ఈ మినీ కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలో పటిష్ట చర్యలు చేపట్టనుంది. 5 కేసుల కంటే ఎక్కువ ఉంటే మినీ కంటైన్‌మెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేయనుంది. ఒకే అపార్ట్‌మెంట్‌లో కేసులు వస్తే హౌజ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తారు. క్లస్టర్‌ పరిధిలో బారిగేడ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేవలం శానిటేషన్, మున్సిపల్‌ సిబ్బంది, వైద్యారోగ్య శాఖ సిబ్బందిని మాత్రమే అనుమతించనున్నట్లు జీహెచ్ఎంసీ తెలిపింది.

జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలు శానిటైజేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. జంట నగరాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ బృందాలు సోడియం హైపోక్లోరైట్ స్ప్రేయింగ్‌ చేస్తున్నారు. హై రిస్క్ ప్రాంతాల్లో ఇంటెన్సివ్ శానిటేష‌న్‌, యాంటీ లార్వా స్ప్రేయింగ్‌ చేస్తున్నారు. 19 డిజాస్టర్ డీఆర్ఎఫ్ బృందాల ఆధ్వర్యంలో ఇవాళ కూకట్‌పల్లి, నిజాంపేట్, కేపీహెచ్‌బీ, మియాపూర్ రోడ్లు, ఇతర కాలనీ ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైట్‌తో శానిటైజ్ చేశారు.

మినీ కంటైన్‌మెంట్‌ జోన్లు ఇవే..


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని