GHMC: శ్మ‌శానవాటికల్లో రుసుముల‌పై చ‌ర్య‌లు

తాజా వార్తలు

Updated : 23/05/2021 17:09 IST

GHMC: శ్మ‌శానవాటికల్లో రుసుముల‌పై చ‌ర్య‌లు

హైద‌రాబాద్‌: న‌గ‌రంలోని శ్మ‌శాన వాటిక‌ల్లో కొన్ని అధిక‌ రుసుములు వసూలు చేస్తుండ‌టంపై జీహెచ్ఎంసీ చ‌ర్య‌లు తీసుకుంది. ఈ క్ర‌మంలో నిర్దేశించిన మేర‌కే వ‌సూలు చేయాల‌ని శ్మ‌శాన‌వాటిక‌ల వ‌ద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అన్ని శ్మ‌శాన‌వాటిక‌ల్లో ఒకే విధంగా రుసుములు ఉండాల‌ని నిర్ణ‌యించిన బ‌ల్దియా ఈ మేర‌కు చ‌ర్యలు తీసుకుంది. సాధార‌ణ మృతుల అంత్య‌క్రియ‌ల‌కు రూ.6 వేలు.. కొవిడ్ మృతుల అంత్య‌క్రియ‌ల‌కు రూ.8 వేలు వ‌సూలు చేయాల‌ని శ్మ‌శానవాటిక‌ల నిర్వాహ‌కుల‌ను ఆదేశించింది. నిబంధ‌న‌లు పాటించ‌కుండా అధికంగా వ‌సూలు చేస్తే క‌ఠినంగా చ‌ర్య‌లు ఉంటాయ‌ని జీహెచ్ఎంసీ స్ప‌ష్టం చేసింది.

మరోవైపు గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా పాజిటివ్‌ వచ్చిన పారిశుధ్య సిబ్బందికి పూర్తి వేతనం ఇస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. గత ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పింది. వైరస్‌ సోకిన వారి మొబైల్‌లో వచ్చిన సమాచారాన్ని సంబంధిత సర్కిల్‌లోని అధికారులకు చేరవేయాలని సూచించింది. ప్రతి నెలా 23వ తేదీన సేకరించిన హాజరు ప్రకారం కార్మికులకు వేతనాలు అందిస్తున్నామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని