ఈటలకు గవర్నర్‌ ఫోన్‌.. కరోనా వ్యాప్తిపై ఆరా

తాజా వార్తలు

Published : 04/04/2021 18:51 IST

ఈటలకు గవర్నర్‌ ఫోన్‌.. కరోనా వ్యాప్తిపై ఆరా

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడి చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆరా తీశారు. ఈ మేరకు పుదుచ్చేరి నుంచి మంత్రి ఈటలకు గవర్నర్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. కొవిడ్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకీ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడంపై గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ కట్టడి, వ్యాధి నిర్ధారణ, రోగులకు అందిస్తున్న చికిత్సలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని.. ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలను కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని