తితిదే కమిటీకి ప్రామాణికత లేదు: గోవిందానంద

తాజా వార్తలు

Updated : 27/05/2021 20:21 IST

తితిదే కమిటీకి ప్రామాణికత లేదు: గోవిందానంద

వారి వాదనలు గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయని వ్యాఖ్య 
హనుమంతుడి జన్మస్థానంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

తిరుపతి: హనుమంతుడి జన్మస్థానంపై తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో జరిగిన చర్చ అసంపూర్తిగా ముగిసింది. తిరుమలలోని అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలమంటూ శ్రీరామనవమి నాడు తితిదే చేసిన ప్రకటనను ఖండిస్తూ హంపిలోని హనుమద్‌ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ ఇప్పటికే పలుమార్లు లేఖలు రాసింది. దీనిపై ఇవాళ తితిదే పండిత కమిటీ సభ్యులు, హనుమద్‌ జన్మభూమి ట్రస్ట్‌ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి మధ్య తిరుపతిలో చర్చ జరిగింది. చర్చ అనంతరం గోవిందానంద మీడియాతో మాట్లాడారు.

కల్పాలు, మన్వంతరాలు గడిచాక హనుమంతుడి జన్మస్థానంపై చర్చేంటని గోవిందానంద ప్రశ్నించారు. రామాయణం ప్రకారం కిష్కంధనే మారుతి జన్మస్థలమని.. తితిదే కమిటీకి ప్రామాణికత లేదన్నారు. ధార్మిక విషయాలపై శృంగేరి శంకరాచార్యులు, కంచి కామకోటి పీఠాధిపతులు, మధ్వాచార్యులు, తిరుమల పెదజీయర్‌, చినజీయర్‌ సమక్షంలో చర్చించాలన్నారు. ఇది అధికారులు అభిప్రాయమే కానీ జీయర్ స్వాములకు సంబంధం లేదని చెప్పారు. సామాన్యులను గందరగోళంలోకి నెట్టేలా తితిదే వాదనలు ఉన్నాయని ఆక్షేపించారు. తితిదే నిర్ణయంపై తాము జీయర్‌ స్వాముల వద్దకు వెళ్తామని చెప్పారు. అనంతరం గోవిందానందతో జరిగిన సంవాదంపై తితిదే పండిత కమిటీ వివరణ ఇచ్చింది. గోవిందానంద నోటి వెంట అనుచిత వ్యాఖ్యలు వస్తాయననుకోలేదని సంస్కృత విద్యాపీఠం వీసీ అన్నారు. గోవిందానందకు సంస్కృతంలో ఏమీ పరిచయం లేదని, కొందరికి విద్య ఉండేది.. వాదన కోసమని ఆయన అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని