ఏపీ-తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ

తాజా వార్తలు

Updated : 12/06/2021 17:06 IST

ఏపీ-తెలంగాణ సరిహద్దులో వాహనాల రద్దీ

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌- తెలంగాణ సరిహద్దులో ఇవాళ మధ్యాహ్నం వరకు భారీగా వాహనాలు రద్దీ నెలకొంది.  కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు సమీపంలోని రామాపురం అడ్డరోడ్డు వద్ద  వాహనాల రద్దీ పెరిగింది. వారంతపు సెలవులు రావడంతో తెలంగాణకు వెళ్లే వాహనాల సంఖ్య బాగా ఎక్కువైంది. ఈ-పాస్‌ నిబంధనతో వాహనాలు ఎక్కువసేపు ఆగాల్సి వస్తోంది. తెలంగాణ పోలీసులు నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయడంతో మధ్యాహ్నం వరకు రద్దీ కొనసాగింది. తెలంగాణలోకి ప్రవేశించేందుకు విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారి-65 రామాపురం అడ్డరోడ్డుకు మాత్రమే అనుమతివ్వవడంతో వాహనాల రద్దీ గతవారం తరహాలోని పెరిగిపోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని