బిస్కెట్‌ కప్‌లో టీ‌.. భలే గిరాకీ

తాజా వార్తలు

Published : 14/12/2020 11:37 IST

బిస్కెట్‌ కప్‌లో టీ‌.. భలే గిరాకీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేరళ రాష్ట్రం త్రిస్సూర్‌లోని ఓ బేకరీకి జనాలు క్యూ కడుతున్నారు. అక్కడ టీ తాగేందుకు బారులు తీరుతున్నారు. ఛాయ్‌ కన్నా కప్పునే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. టీ తాగగానే కప్పును ఇష్టంగా తినేస్తున్నారు. ఏఆర్‌ మీనన్‌ రోడ్డులోని ఓ బేకరీ యజమాని వినూత్నంగా ఆలోచించారు. బిస్కెట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన కప్పుల్లో టీని విక్రయిస్తున్నారు. ఈ అరుదైన టీ కప్పులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఛాయ్‌ ఎంత వేడిగా ఉన్నా ఈ కప్‌ 20 నిమిషాల వరకు మెత్తబడకుండా ఉంటుంది. ఈ ప్రత్యేకమైన టీ ధర కేవలం 20 రూపాయలే.

వినూత్నంగా ఆలోచించి తయారు చేసిన బిస్కెట్‌ కప్‌ టీకి కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ లభించిందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వినియోగించి పడేసే కప్పులకన్నా ఈ బిస్కెట్‌ కప్‌ వినియోగం ఎంతో ఉపయోగకరమంటున్నారు. ఈ బిస్కెట్‌ కప్పులు హైదరాబాద్‌లో తయారవడం విశేషం. రానున్న రోజుల్లో వెనీలా, చాక్లెట్‌ రుచుల్లో కప్పులు తయారుచేసేందుకు సంబంధిత తయారీ సంస్థ యోచిస్తోంది.

ఇవీ చదవండి...

రైల్వే ఇకపై మరింత పర్యావరణ హితం

అక్కడ టీ ధర రూ.1000!Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని