మాటలొద్దు.. వ్యాక్సినేషన్‌ వేగం పెంచండి: రాహుల్‌
close

తాజా వార్తలు

Published : 16/06/2021 16:26 IST

మాటలొద్దు.. వ్యాక్సినేషన్‌ వేగం పెంచండి: రాహుల్‌

దిల్లీ: కొవిడ్‌ ఉద్ధృతి నేపథ్యంలో దేశంలో వేగవంతమైన, పూర్తి వ్యాక్సినేషన్‌ కావాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కోరారు. భాజపా మార్కు ప్రాస నినాదాలు, అవాస్తవ ప్రచారాలు అవసరం లేదని పేర్కొంటూ బుధవారం ఆయన ట్వీట్‌ చేశారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తగినన్ని టీకా డోసుల సరఫరా చేయడంలో భారత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల టీకాల కొరత ఏర్నడిందని ఆరోపించారు. మోదీ ప్రతిష్ఠను కాపాడేందుకు ప్రభుత్వ వర్గాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ వైరస్‌ వ్యాప్తిని పెంచడానికి దోహదపడుతున్నాయని.. తద్వారా అధిక సంఖ్యలో ప్రజలు కొవిడ్‌ మహమ్మారికి బలవుతున్నారని ధ్వజమెత్తారు.  కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య సమయాన్ని ఎలాంటి శాస్త్రీయ ఒప్పందం లేకుండానే పెంచాలని ప్రభుత్వం సిఫారసు చేసినట్లు తెలుపుతున్న వార్తా కథనాన్ని ఆయన ట్విటర్‌లో పోస్టు చేశారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని