హైటెక్‌ ఆటోవాలా..!

తాజా వార్తలు

Published : 21/07/2021 01:05 IST

హైటెక్‌ ఆటోవాలా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడులోని చెన్నైకి చెందిన అన్నాదురై భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాడు. బాగా చదువుకుని వ్యాపారవేత్త అవ్వాలని అనుకున్నాడు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అతడి కలలను కల్లలు చేశాయి. అయినా అన్నాదురై నిరుత్సాహపడలేదు. తాను చేస్తున్న చిన్న పనైనా గొప్పగా చేయాలని సంకల్పించాడు. దీంతో తన ఆటోను హైటెక్‌ ఆటో రిక్షాగా మార్చేశాడు. తన ఆటో ఎక్కేవారికి సరికొత్త అనుభూతి కలిగించేలా ఆటోలో యాపిల్‌ ఐపాడ్‌, వార్తా పత్రికలు, శానిటైజర్‌, టీవీ, మినీ ఫ్రిజ్‌, సెల్‌ఫోన్‌ చార్జర్‌, తినడానికి చిరుతిళ్లు అందుబాటులో ఉంచాడు. ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించే అన్నాదురై ఆటో ఎక్కే ముందు.. దిగిన తర్వాత వాళ్లకు వినమ్రపూర్వకంగా నమస్కారం చేస్తాడు. గురువులపై ఉన్న గౌరవంతో.. ఉపాధ్యాయులకు తన ఆటోలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని