ఎగవేసిన పన్ను చెల్లింపునకు ‘రాంకీ’ అంగీకారం

తాజా వార్తలు

Updated : 09/07/2021 17:18 IST

ఎగవేసిన పన్ను చెల్లింపునకు ‘రాంకీ’ అంగీకారం

హైదరాబాద్‌: ఈనెల 6న హైదరాబాద్‌లోని రాంకీ సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో భారీగా అక్రమ లావాదేవీలు గుర్తించినట్టు ఆదాయపన్నుశాఖ ప్రకటన విడుదల చేసింది. స్థిరాస్తి, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల నిర్వహణ రంగంలో ఉన్న ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా... అక్రమ లావాదేవీలకు సంబంధించి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. 2018-19లో ఈ సంస్థ సింగపూర్‌లోని ఓ ప్రవాస సంస్థకు మెజార్టీ వాటాను విక్రయించి భారీగా మూలధనం ఆర్జించినట్టు ఐటీశాఖ పేర్కొంది. అమ్మకాలకు సంబంధించిన పత్రాలు, లాభాలను దాచిపెట్టి నష్టాలుగా చూపారని వివరించారు. దాదాపు రూ.1200 కోట్లు కృత్రిమ నష్టాలు చూపి పన్ను ఎగ్గొట్టినట్టు గుర్తించామని ఐటీశాఖ పేర్కొంది. వాటికి సంబంధించి లెక్కల్లోకి రాని లావాదేవీలను గుర్తించామని ఆదాయపన్నుశాఖ తెలిపింది. లెక్కల్లోకి రాని రూ.300 కోట్లతో పాటు, ఎగవేతకు పాల్పడిన పన్నును చెల్లించేందుకు ప్రముఖ సంస్థ అంగీకరించినట్టు ఐటీశాఖ వెల్లడించింది. తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఐటీ శాఖ స్పష్టం చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని